అర్థములు
శ్రీ సూరి రామకోటిశాస్త్రి
(సంస్కృత కళాశాలధ్యక్షులు, తెనాలి.)
పుట 1 ''దృశా ద్రాఘీయస్యా''
శివే! = ఓ శుభదాయినీ !, దవీయాంసం = కడుదూరమున నున్న, దీనం = దీనుడనగు, మామపి = నన్ను గూడ, కృపయా = దయతో, దర...రుచా = అరవిడిచిన నల్లగలువకాంతివంటికాంతిగల, ద్రాఘీయస్యా = మిక్కిలి దూరము ప్రసరించు, దృశా = చూపుతో, స్నపయ = స్నానము చేయింపుము, అనేన = దీనిచేత, అయం = ఇతడు, ధన్యః = కృతార్థుడు, భవతి = అగును. ఇయతా = ఇంతమాత్రముచేత, తే = నీకు, హానిః = నష్టము, నచ = ఎంతమాత్రమును లేదు. హిమకరః = చంద్రుడు, వనే వా = అడవియందు గానీ, హర్మ్యేవా = మేడమీదగానీ, సమకరనిపాతః = ఒకే విధముగా గిరణముల బ్రసరింప జేయువాడు గదా!
పుట 3 ''సు వినయో యస్య స్వభావాయతే''
యస్య = ఎవనికీ, సువినయః = మంచి వినయము, స్వభావాయతే = స్వభావమగు చున్నదో.
పుట 12 ''శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే''
(చూ. 2 వా. పుట 151)
శాంతం = శాంతమయిన దానినిగను, శివం = సుఖమయినదానిగను, అద్వైతం = ద్వైతముకాని దానిగను, చతుర్థం = మేలకువ కల నిదుర అను అవస్థలను పై దనిగను, మన్యంతే = తలచుచున్నారు, సః = అట్టి, ఆత్మా = ఆత్మ, విజ్ఞేయః = ఎఱుగదగినది.
పుట 12 ''యత్ర హి ద్వైతమివ భవతి''
యత్రహి = ఎపుడైతే, ద్వైతమివ = ద్వైతమువలె, భవతి = అగుచున్నదో, తత్ = అపుడు, ఇతరః = ఇతరుడు, ఇతరం = ఇతరుని, పశ్యతి = కాంచుచున్నాడు, యత్రతు = ఎపుడైతే, అస్య = ఇతనికి, సర్వం = అంతయు, ఆత్మైవ = ఆత్మయే, అభూత్ = ఆయెనో, తద్ = అపుడు, కేన = దేనితో, కం = దేనిని, ఎవనిని, పశ్యేత్ = కాంచును?
పుట 13-10 'ద్వితీయాద్వై'
ద్వితీయాద్‌వై = రెండవదాని వలననే, భయం = భయము, భవతి = ఏర్పడును.
పుట 13-21 'కిం గృహ్ణామి'
కిం = దేనిని, గృహ్ణా మి = తీసికొనెదను , కిం = దేనిని, విసృజామి = విడిచిపెట్టెదను.
పుట 14.11 'యతో వాచో'
మనసాసహ = మనసు=తో కూడ, అప్రాప్య = చేర నేరక, యతః = దేనినుండి, వాచః = వాక్కులు, నివర్తన్తే = మఱలునో.
పుట 14-15 'యన్మనసా'
యద్ = దేనిని, మనసా = మనసు= చేత, న మనుతే = తెలిసికొనజాలడో, యేన = దేనిచేత, మనః = మనసు=, మతం = తెలియబడుచున్నదో.
పుట 15 'యస్యా మతం'
యస్య = ఎవనికి, అమతం = (పరతత్త్వము) జ్ఞేయము కాదో, తస్య = అతనికి, మతం = తెలిసినది, యస్య = ఎవనికి, మతం = (ఆ తత్త్వము) జ్ఞేయమో, సః = అతడు, న వేద = తెలిసినవాడుకాడు.
పుట 15-17 'వేదాంత వాక్య కుసుమ'
సూత్రాణాం = సూత్రములు, వేదాంతవాక్య = ఉపనిషత్తులు అనెడి, కుసుమ = పుష్పములను, గ్రథనార్థత్వాత్ = కూర్చుట ప్రయోజనముగా గలవి యగుట వలన.
పుట 16 'విదేహం దదామీ'
విదేహం = విదేహ రాజ్యమును, సహ మాం చాపి = దానితోపాటు నన్నుకూడ, దాస్యాయ = సేవకొఱకు, దదామి = ఇచ్చుచున్నాను.
పుట 16 'ఈశ్వరానుగ్రహాదేవ'
పుంసాం = మానవులకు, ఈశ్వరానుగ్రహాదేవ = పరమేశ్వరుని యనుగ్రహము వలననే, మహాకృతత్రాణా = మహాభయమునుండి కాపాడునట్టి (అభయము నిచ్చునట్టి), అద్వైతవాసనా = అద్వైతమునందభిరుచి, ద్విత్రాణాం = ఇద్దఱు ముగ్గురికి, ఉపజాయతే = కలుగుచున్నది.
6-24)
పుట 16 'చంద్రశేఖర'
చంద్ర.....స్మరణమ్ = చంద్రునిసిగయందు దాల్చిన శివుని పాదారవింద ధ్యానము, పరమౌషధమ్ = మంచి మందు.
పుట 18 'వేదోనిత్యం'
వేదః = వేదము. నిత్యం = ప్రతిదినము, అధీయతామ్ = అధ్యయనము చేయబడుగాక, తదుదితం = ఆవేదవిహితమగు, కర్మ = ధర్మము, స్వనుష్ఠీయతామ్ = చక్కగా నాచరింపబడు గాక.
పుట 20-14 'అపూర్వమాణం' (చూ. 1 వా. పుట 144)
యద్వత్ = ఎట్లు, ఆపూర్యమాణం = నీటిచే అన్ని వైపులనుండియు నిండింపబడు నట్టియు, అచల ప్రతిష్ఠం = అచలముగ నుండునట్టి, సముద్రం = మున్నీటిని, ఆపః = నీళ్లు, ప్రవిశన్తి = ప్రవేశించునో, తద్వత్ = అట్లు, సర్వేకామాః = అన్ని కోరికలు, యం = ఎవనిని, ప్రవిశన్తి = ప్రవేశించునో, సః = అతడు. శాంతిం = శాంతిని, ఆప్నోతి = పొందుచున్నాడు, కామకామీ = కోరికలు కోరువాడు, న = పొందడు.
పుట 22-14 'స్వల్ప మప్యస్య'
అస్య ధర్మస్య = ఈ ధర్మముయొక్క, స్వల్పమపి = కొద్దియుగూడ, మహతః = గొప్ప, భయాత్ = భయమునుండి, త్రాయతే = రక్షించుచున్నది.
పుట 25-8 'పద్మావతీ'
పద్మావతీ.......చక్రవర్తీ = పద్మావతీ దేవిచే చరణ విన్యాసము చేయించు చక్రవర్తి.
పుట 25-22 'అహం త్వా'
అహం = నేను, త్వా = నిన్ను, సర్వ పాపేభ్యః = అన్ని పాపములనుండి, మోక్షయిష్యామి = విడిపింతును, మా శుచః = శోకింపకుము.
పుట 27 'సంపత్కరాణ'
మాతః = ఓ తల్లీ !, సరోరుహాక్షి = తామరలవంటి కన్నులు గలదానా!, మాన్యే = ఓ పూజ్యురాలా!, త్వద్వన్దనాని = నీ నమస్కారములు, సంపత్కరాణి = సంపదల నిచ్చునవి, సకల.... నందనాని = అన్ని యింద్రియములకునంతనముకూర్చునవి, సామ్రాజ్య....విభవాని = సామ్రాజ్య మిచ్చెడి వైభవముగలవి, దురిత....ఉద్యతాని = పాపములను బోగొట్టునవి, (తాని = అవి), అనిశం = ఎల్లపుడు, మామేవ = నన్నే, కలయన్తు = ధన్యుని చేయుగాక!
పుట 28 'సమునిః'
సః మునిః = ఆముని (శఙ్కరుడు), ద్విజ..నివృత్తయే = బ్రాహ్మణుని పేదఱికము బాపుటకై, నవనీత కోమలైః = వెన్నవలె సుకుమారములగు, పదచిత్రైః = చిత్రపదములుగల, మధురైః = ఇంపైన, స్తవైః = స్తోత్రములచే, ముర.....కుటుంబినీం = లక్ష్మీదేవిని, ఉపస్థితవాన్ = ప్రార్థించెను.
పుట 47 'యః ప్రయాయ'
యః = ఎవడు (మయూరవర్మ), గురుణా = గురువగు, వీరవర్మణా నమం = వీరవర్మతో గూడ, నిఖిలం = అన్ని, ప్రవచం = విద్యలను, అధిజిగమిషుః = క్షుణ్ణముగా నభ్యసింప దలచినవాడై, పల్లవేంద్రపురం = పల్లవ రాజు పురమునకు, ప్రయాయ = పయనించి, ఘటికాం = విద్యాస్థానమును, వివేశ = ప్రవేశించెను.
పుట 18 'స్కంద శిష్య'
స్కందశిష్యః = స్కందుని శిష్యుడగు పల్లవరాజు, సత్యసేనాత్ రాజ్ఞః = సత్యసేనరాజునుండి, ఘటికాం = విద్యాస్థానమును, జహార = వశము చేసికొనెను.
పుట 49 'తత్పుత్రసూనుః'
తత్పుత్రసూనుః = అతని మనుమడు, నరసింహవర్మ = నరసింహవర్మ, ఘటికాం = విద్యాస్థానమును, కైలాస...వేశ్మ = కైలాసనాథ దేవాలయమును, వ్యధాత్ = కట్టించెను.
పుట 50 'దేవ బ్రాహ్మణ'
దేవ....విభవః = దేవతలకోఱకు బ్రాహ్మణులకొఱకు సత్కరించిన తన సంపదకలవాడు.
పుట 53-22 'సశిఖం'
సశిఖం = శిఖతోసహ, వపనం = క్షురకర్మ, కృత్వా = చేయించుకొని, బహిఃసూత్రం = యజ్ఞోపవీతమును, బుధః = విజ్ఞుడు, త్యజేత్ = విడనాడవలెను.
పు 67-21 'సేనయోః'
సేనయోరుభయోః మధ్యే = రెండు సేనలనడుమ, అచ్యుత = ఓకృష్ణా, మే = నాయొక్క, రథం = రథమును, స్థాపయ = నిలుపుము.
పుట 67-21 'శిష్యస్తే 7హం'
తే = నీకు, అహం = నేను, శిష్య = శిష్యుడను, త్వాం = నిన్ను, ప్రపన్నం = శరణుజొచ్చిన, మాం = నన్ను, శాధి = శాసించుము. (నాకుపదేశింపుము)
( 6- 25 )
పుట 68 - 2 'తస్మాత్'
భారత = ఓ అర్జునా !, తస్మాత్ = అందువలన, యుద్ధ్యస్వ = యుద్ధముచేయుము, అనుశోచితుం = విచారపడుటకు, న అర్హసి = తగవు.
పుట 68 - 13 'నజాయతే'
(ఆత్మ), కదాచిత్ = ఎన్నడును, న జాయతే = పుట్టడు, న మ్రియతే = గిట్టడు.
పుట 80 'కిం జ్యోతి'
తవ = నీకు, జ్యోతిః = వస్తువుల బ్రకాశింపజేయునది, కిం = ఏది? మే = నాకు, అహని = పగటియందు, సూర్యః = సూర్యుడు; రాత్రౌ = రాత్రియందు, ప్రదీపాదికం = దీపము, చంద్రుడు మొ||. స్యాత్ = అగును, ఏవం = ఇట్లే, రవి....విధౌ = సూర్యుని, దీపమును చూచుటలో, జ్యోతిః = జ్యోతిసు=, కిం = ఏదియో, మే = నాకు ఆఖ్యాహి = చెప్పుము, చక్షుః = కన్ను; తస్య = అది, నిమీల...సమయే = మూసినపుడు, కిం = ఏది? ధీః = బుద్ధి; ధియంః = బుద్ధిని, దర్శనే = చూచుటలో(చూచునది) కిం = ఏది? తత్ర = అచట, అహం = నేను, అతః = ఇందువలన, భవాన్ = నీవు, పరమకం జ్యోతిః = పరంజ్యోతివి, ప్రభో = స్వామీ, తత్ = ఆజ్యోతి, (అహం) అస్మి = నేనగుచున్నాను.
పుట 108 -12 'ఛాయాతోయం'
ఛాయా = నీడ (ఆశ్రయము), తోయం = నీరు, అశన మనసం = ఆహారవస్త్రములు.
పుట 110-4 'పురాణమిత్యేవ'
సర్వం = అంతయు, పురాణమిత్యేవ = ప్రాతదిగదాయని' నసాధు = మంచిదికాదు.
పుట 112 'రామో విగ్రహవాన్'
రామః = శ్రీరాముడు, విగ్రహవాన్ = రూపుదాల్చిన, ధర్మః = ధర్మము.
పుట 113' యం పాలయసి'
రాఘవశ్రేష్ఠ = ఓ రఘువంశ##శ్రేష్ఠా?, త్వం = నీవు, ధృత్యా = థైర్యముతో, నియమేన చ = నియమముతోను, యం ధర్మం = ఏ ధర్మమును పాలయసి = పాటించు చుంటివో, సః ధర్మఃవై = ఆధర్మమే, త్వాం = నిన్ను, అభిరక్షతు = రక్షించుగాక.
పుట 121-5 'జననీ జన్మభూమిశ్చ'
జననీ = తల్లి, జన్మభూమిశ్చ = జన్మస్థానమును, స్వర్గాదపి = స్వర్గముకంటెగూడ, గరీయసీ = గొప్పది.
పుట 121-13 'జగతః పితరౌ'
జగతః = ప్రపంచమునకు, పితరౌ = తల్లిదండ్రులగు' పార్వతీపరమేశ్వరౌ = పార్వతీపరమేశ్వరులను, వన్దే = నమస్కరించుచున్నాను.
పుట 140-8 'తమేవభాన్తం'
భాన్తం = ప్రకాశించుచున్న, తమేవ = ఆ పరమాత్మనే, సర్వం = అంతయు, అనుభాతి = అనుసరించి ప్రకాశించుచున్నది. తస్య = ఆపరమాత్మయొక్క, భాసా = ప్రకాశముచేత, ఇదం = ఇది, సర్వం = అంతయు, భాతి = ప్రకాశించుచున్నది.
పుట 141-11 'యస్మిస్ స్థితో' (గీత 6-22-చూ. 1 వా. పుట. 72)
యం = ఏయాత్మలాభమును, లబ్ధ్వా = పడసి, అపరం = మరొకలాభమును, తతః = ఆ యాత్మలాభముకంటె, అధికం = ఎక్కువ, అయినది (కలదని), నమన్యతే = తలపడో, యస్మిన్ = దేనియందు, లబ్ధమైనయాత్మ యందు, స్థితః = ఉన్నవాడై, గురుణాపి దుఃఖేన = ఎంతటివంత చేనయినను, న విచాల్యతే = చలింపజేయబడడో (దానిని యోగమని అరయునది.)
పుట 142 'శాంతా మహన్తో'
శాన్తాః = శాన్తులగు, మహాన్తఃసన్తః = మహాత్ములు, వసన్తవత్ = వనన్తమువలె లోకహితం = లోకమునకు హితమును, చరన్తః = ఆచరించుచు, స్వయం = తాము, భీమ.......అర్ణవం = భయంకరమగు సంపారసముద్రమును, తీర్ణాః = దాటినవారై, అన్యాన్‌జనానపి = ఇతరులను గూడ, అహేతునా = నిష్కారణముగా, తారయ న్తః = తరింపజేయుచు; వసన్తి = నివసించుచున్నారు.
పుట 143 'గణ్య2హం'
అహం = నేను, దీనదీనః = అతిదీనుడనుగా, గణ్య = లెక్కింపబడుచున్నాను, శివతమః = శివాకారుడవగు, త్వం = నీవు, ఇహ = ఇచట, దీనబంధుః = దీనులకుచుట్టముగా, గణ్యసే = పరిగణింపబడుచున్నావు. అథ = అనంతరము, జ్ఞానమూర్తీ = జ్ఞానస్వరూపుడవగు, సద్గురూ = ఓ సద్గురూ! భగవత్....తార్థం = శంకరాచార్యులవారిచే సంస్థాపితమును, విశ్వప్రశస్తం = లోకవిఖ్యాతమును, హితం = హితావహమును నగు, చిచ్ఛక్త్యా.............పీఠం = చిచ్ఛక్తి కామకోటి పీఠమును, మహసా = తేజసు=తో, కలయసి = నింపుచున్నావు, పాపంకైః = పాపపు బురదచే, ఆవిలం = కలుషితుడనగు, త్వత్పాద..జనిం = మీ పాదారవిందమునందు సమర్పింపబడిన జన్మగల, మా = నన్ను, అవ = రక్షింపుము.
పుట 167 'యస్య ప్రపాదాత్'
యస్య = ఏగురువుయొక్క, ప్రసాదాత్ = అనుగ్రహమువలన, అహమేవ = నేనే, విష్ణుః = విష్ణువునో, మయి ఏవ = నాయందే, సర్వం = సమస్త ప్రపంచము, కల్పితం చ = కల్పింపబడినదో, ఇత్థం = ఇట్లు, సదాత్మరూపం = సత్యాత్మరూపమును, విజానామి = తెలిసికొంటినో, తస్య = ఆగురువుయొక్క, అంఘ్రియుగ్మం = పాదద్వంద్వమును, నిత్యం = ఎల్లపుడు, ప్రణతో స్మి = నమస్కరింతును
.
పుట 171 'లీలాలోలతమా'
శ్రీగోవిందః = శ్రీమన్నారాయణుడు, గ్రాహగ్రహార్తం = మొసలిపట్టుచే బాధపడుచున్న, గజం = గజేంద్రుని, సంరక్షితుం = రక్షించుటకు, ఉదిత్వరత్వరః త్వర = జెందుచున్నవాడై, లీలాలోలతమాం = విలాసములచే చంచలురాలైన (నూత్ననూతన విలాసములుగల) రమాం = లక్ష్మీదేవిని, అగణయన్ = లెక్కచేయక, నీలాం = నీలాదేవిని, అనాలోకయన్ = చూడక, కించ = ఇంకను, మహీం = భూదేవిని, ముంచన్ = విడిచిపెట్టి, అహీశ్వరమయం = సర్పరాజగు ఆదిశేషరూపమగు, మంచం = శయనమును, హఠాత్ = హఠాత్తుగా, వంచయన్ = మోసగించుచు (విడిచి), ద్విజరాజమపి = వాహనమగు ఖగేంద్రుని గూడ, ఆకరన్ = బాధించుచు (అధిరోహించక) అతిజవాత్ = మిక్కిలి వేగముతో, ఉదైత్ = వెడలెను.
|